అక్రమ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

By narsimha lodeFirst Published Mar 4, 2021, 3:57 PM IST
Highlights

 హైద్రాబాద్ లో అక్రమ నిర్మాణాలపై  తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు తెలిపింది. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది.


హైదరాబాద్: హైద్రాబాద్ లో అక్రమ నిర్మాణాలపై  తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు తెలిపింది. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది.

అక్రమ నిర్మాణాలపై  అనేక మంది కోర్టులకు వస్తున్నారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడాల్సిందేనని హైకోర్టు అధికారులను ఉద్దేశించి చెప్పింది. అక్రమ నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లను ఆదేశించింది.

2019లో ఎన్ని అక్రమ నిర్మాణాలు గుర్తించారు, వాటిపై ఏం చర్యలు తీసుకొన్నారని కోర్టు ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాల విషయంలో కోర్టుల్లో పిటిషన్లు ఉంటే ఏం చేశారని ఉన్నత న్యాయస్థానం అడిగింది. స్టేలు తొలగించాలని కోర్టుల్లో ఎన్ని పిటిషన్లు వేశారో చెప్పాలని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. స్టే వేకేట్ పిటిషన్లు దాఖలు చేయకపోతే కారణాలు చెప్పాలని కోరింది.

నాళాలు, కాలువలపై  అక్రమ నిర్మాణాల కారణంగా వర్షం నీరు వెళ్లే దారి లేక నగరం ముంపునకు గురైందని నిపుణులు చెబుతున్నారు.ఈ కారణంగానే గత ఏడాదిలో భారీ వర్షం కారణంగా నగరంలో చాలా ప్రాంతాల్లో ముంపుతో ఇబ్బంది పడ్డాయని నిపుణులు చెబుతున్నారు. 

click me!