స్నేహం పేరిట పరిచయం.. యువతిపై అమేజాన్ ఉద్యోగి అఘాయిత్యం

Published : Mar 04, 2021, 02:20 PM ISTUpdated : Mar 04, 2021, 02:34 PM IST
స్నేహం పేరిట పరిచయం.. యువతిపై అమేజాన్ ఉద్యోగి అఘాయిత్యం

సారాంశం

ఇంటర్న్ షిప్ లో భాగంగా యువతికి ఇతనితో పరిచయం ఏర్పడింది. మూడేళ్లుగా ఆమెతో స్నేహంగా ఉంటూ మాయమాటలతో నమ్మించాడు.

స్నేహం పేరిట పరిచయం పెంచుకొని ఓ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంటర్న్ షిప్ కోసం వచ్చిన ఓ  యువతితో పరిచయం పెంచుకొని.. మాయమాటలతో దగ్గరై ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. అమెజాన్ సంస్థలో పనిచేస్తున్న నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరికి చెందిన.. సికింద్రాబాద్ లోని ప్రశాంత్ నగర్ లో నివసించే చింతా సాయి గణేష్(26) అమెజాన్ సంస్థలో టీంలీడర్ గా పనిచేస్తున్నాడు. పంజాబ్ కు చెందిన యూసూఫ్ గూడలోని ఓ కళాశాల విద్యార్థిని(22) వెకంటగిరిలో ఉంటుంది.

ఇంటర్న్ షిప్ లో భాగంగా యువతికి ఇతనితో పరిచయం ఏర్పడింది. మూడేళ్లుగా ఆమెతో స్నేహంగా ఉంటూ మాయమాటలతో నమ్మించాడు. నేరుగా యువతి ఇంటికి వెళ్లాడు. వారి కుటుంబసభ్యులతోనూ చనువుగా ఉంటున్నాడు. అతడిని నమ్మిన యువతిని సూర్యలంక బీయ్, నగరంలోని ఇతర పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లాడు.

ఈ నేపథ్యంలోని ఓ హోటల్ గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్దిరోజులుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని సాంకేతికత ఆధారంగా పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!