తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు అడ్డంకులన్ని తొలగిపోయాయి. 77 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు గతంలో ఇచ్చిన స్టేను తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఎత్తేసే అవకాశం ఉంది
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు అడ్డంకులన్ని తొలగిపోయాయి. 77 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు గతంలో ఇచ్చిన స్టేను తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఎత్తేసే అవకాశం ఉంది.
అయితే నాలుగైదు మున్సిపాలిటీల్లో మాత్రం స్టే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం చేసిన సవరణలతో పిటిషనర్లు సంతృప్తి వ్యక్తం చేయడంతో పుర పోరుకు మార్గం సుగమమైంది.
Also Read:మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం: స్పష్టం చేసిన సీఎం కేసీఆర్
గత నెల 22న విచారణ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ప్రభుత్వానికి ట్విస్టిచ్చింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే విధించిన 75 మున్పిపాలిటీల్లో స్టేను వేకేట్ చేయించుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
తెలంగాణ రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపాలిటీలతో పాటు మరో 13 కార్పోరేషన్లు ఉన్నాయి.ఈ కార్పోరేషన్లలో ప్రస్తుతం పాలకవర్గాలు కొనసాగుతున్నాయి.
మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా తయారీని చేపట్టారు. అయితే రిజర్వేషన్ల ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకొన్నాయని పలువురు హైకోర్టును ఆశ్రయించారు.
మున్సిపాలిటీల్లోని ఓటర్ల జాబితాలో పొరపాట్లు జరిగాయని కూడ హైకోర్టును ఆశ్రయించిన వారు కూడ ఉన్నారు. దీంతో హైకోర్టు ప్రభుత్వంతో పాటు పిటిషనర్ల వాదనలను వింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిచేయాలని, రిజర్వేషన్ల ప్రక్రియలో అవకతవకలను సరిచేయాలని పిటిషనర్లు కోరారు.
Also Read:municipal polls: న్యాయస్థానం తీర్పులో ట్విస్ట్, కేసీఆర్ కు వరం
అంతేకాదు రిజర్వేషన్లు, వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో చోటు చేసుకొన్న పరిణామాల్లో అవకతవకలను సరిచేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టులో పిటిషనర్లు గట్టిగా వాదించారు.
దీంతో రాష్ట్రంలోని 77 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణపై హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఉత్తర్వులపై ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ లో కూడ రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.