రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై హైకోర్టు మరోసారి అసంతృప్తిని వ్యక్తం చేసింది.
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై హైకోర్టు మరోసారి అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు, రోగుల సంఖ్య తదితర విషయాలపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు విచారణ నిర్వహించింది. కరోనా కట్టడిలో భాగంగా నైట్ కర్ప్యూ విధించినట్టుగా తెలంగాణ సర్కార్ హైకోర్టు వివరించింది. నైట్ కర్ప్యూ కారణంగా కరోనా కేసులు తగ్గాయని అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఎక్కడ కేసులు తగ్గాయని హైకోర్టు ప్రశ్నించింది.
పగటి వేళల్లో బహిరంగ ప్రదేశాలు బార్లు, రెస్టారెంట్లు, థియేటర్ల వద్ద ఎలాంటి చర్యలు తీసుకొన్నారని ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల్లో కుంభమేళా నుండి వచ్చినవారికి క్వారంటైన్ లో కనీసం 10 రోజులు ఉంచుతున్నారని హైకోర్టు ప్రశ్నించింది. కుంభమేళా నుండి వచ్చినవారిని క్వారంటైన్ లో ఎందుకు ఉంచడం లేదని ప్రశ్నించింది.
undefined
తెలంగాణ సరిహద్దుల్లో కరోనా రిపోర్టులు చేయకపోవడంపై హైకోర్టు మండిపడింది. రెమిడెసివిర్ రాష్ట్రంలోనే తయారౌతున్నా కొరత ఎందుకు వచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. కోవిడ్ పోర్టల్ లో కోవిడ్ సెంటర్ వివరాలు నమోదు చేయకపోవడంపై కూడ అసంతృప్తిని వ్యక్తం చేసింది. వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకొందని ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు 24 గంటల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాల్సిందిగా కోరింది.
ఆక్సిజన్ కొరత ఉందని మంత్రి ఈటల రాజేందర్ చేసిన ప్రకటనను హైకోర్టు ప్రస్తావించింది. అయితే తమకు సమర్పించిన నివేదికలో మాత్రం ఆక్సిజన్ కొరత లేదని చెప్పడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
సమగ్ర సమాచారాన్ని తమకు ఇవాళ మధ్యాహ్నం రెండున్నరగంటలలోపుగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.