సెంటిమెంట్ల కోసం ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టొద్దు:గణేష్ విగ్రహల నిమజ్జనంపై హైకోర్టు వ్యాఖ్యలు

Published : Aug 18, 2021, 04:12 PM IST
సెంటిమెంట్ల కోసం ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టొద్దు:గణేష్ విగ్రహల నిమజ్జనంపై హైకోర్టు వ్యాఖ్యలు

సారాంశం

గణేష్ విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది. గణేష్, దుర్గామాత విగ్రహల నిమజ్జనం స్పష్టమైన ఆదేశాలు జారీ  చేయాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ నిర్వహించింది.

హైదరాబాద్: సెంటిమెంట్ల కోసం ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టొద్దని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. గణేష్ దుర్గమాత విగ్రహల నిమజ్జనం చేయకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలనే పిటిషన్ పై  తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు విచారణ నిర్వహించింది.

గణేష్ విగ్రహాల నిమజ్జనంపై వివరాలను సమర్పించాలని తెలంగాణ హైకోర్టు మరోసారి ప్రభుత్వాన్ని ఆదేశించింది.  గణేష్ విగ్రహల నిమజ్జనంలో జనం భారీగా గుమికూడకుండా ఏం చర్యలు తీసుకొంటారని కోర్టు ప్రశ్నించింది. రసాయనాలతో కూడిన విగ్రహాలు నిమజ్జనం చేయకండా ఏం చర్యలు తీసుకొన్నారని కూడ హైకోర్టు ప్రభుత్వాన్నిఅడిగింది.

ఇళ్లలోనే మట్టి గణపతులను పూజించాలని ప్రజలకు సూచిస్తామన్న అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. సూచనలు కాదు స్పష్టమైన ఆదేశాలు ఉండాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

గణేష్ విగ్రహలు, దుర్గమాత విగ్రహల నిమజ్జనంపై సెప్టెంబర్ 1వ తేదీలోపుగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 1వ తేదీలోపుగా నివేదికను సమర్పించకపోతే సీనియర్ అధికారులు కోర్టుకు హాజరు కావాలని కోరింది. ఈ పిటిషన్ పై విచారణను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.


 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet: రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయిన కేసీఆర్ | Asianet News Telugu
KCR: కేసీఆర్ ఎంట్రీతో తెలంగాణ రాజకీయం హీట్.. హాట్ కామెంట్స్ తో రచ్చ