4 ఏళ్లుగా ఉన్నతాధికారుల కమిటీ నివేదిక ఏమైంది?: 111 జీవోపై తెలంగాణ హైకోర్టులో విచారణ

By narsimha lodeFirst Published Aug 26, 2021, 1:03 PM IST
Highlights


111 జీవోపై ఉన్నతాధికారుల నివేదిక జాప్యంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 4 ఏళ్లు దాటినా కూడ  ఉన్నతాధికారుల కమిటీ నివేదిక ఇవ్వకపోవడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా కారణంగానే నివేదిక ఇవ్వడంలో ఆలస్యమైందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. సెప్టెంబర్ 13 లోపుగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

హైదరాబాద్:  ఈ ఏడాది సెప్టెంబర్ 13 నాటికి 111 జీవోపై నివేదికను ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.111 జీవోపై తెలంగాణ హైకోర్టులో బుధవారం నాడు విచారణ జరిగింది. ఈ విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నాలుగేళ్లుగా 111 జీవోపై నివేదిక ఎందుకు ఇవ్వలేదని ఉన్నతాధికారుల కమిటీని ప్రశ్నించింది 

హైకోర్టు.నివేదిక జాప్యం వెనుక రహస్యం ఏమిటని  ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగింది. కరోనా కారణంగా నివేదిక ఇవ్వడంలో ఆలస్యమైంది అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ 13 లోపుగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. నివేదిక ఇవ్వకపోతే ఆ రోజుతో కమిటీ రద్దు చేస్తామని హైకోర్టు తేల్చి చెప్పింది.ఉన్నతాధికారుల రిపోర్టును వెబ్ సైట్ లో పెట్టాలని హైకోర్టు ఆదేశించింది.


 

click me!