వివాహేతర సంబంధాన్ని భర్తకు చెప్పాడని.. స్నేహితుడిమీద కత్తితో దాడి...

Published : Aug 26, 2021, 11:48 AM IST
వివాహేతర సంబంధాన్ని భర్తకు చెప్పాడని.. స్నేహితుడిమీద కత్తితో దాడి...

సారాంశం

అక్బర్ ఖాన్ కు ఓ యువతితో ప్రేమ వ్యవహారం ఉంది. ఆమెకు ఇటీవల వివాహమయ్యింది. కానీ, వారిద్దరూ తరచూ కలుసుకుంటున్నారని మహ్మద్ ఈషా అలీ యువతి భర్తకు చెప్పాడు. 

హైదరాబాద్ : ఓ వివాహితతో తనకున్న సంబంధాన్ని ఆమె భర్తకు చెప్పాడని స్నేహితుడి మీద కత్తితో దాడి చేసి గాయపరిచాడు. పోలీసులు కథనం ప్రకారం.. చంద్రాయణగుట్ట షాహీన్ నగర్ ప్రాంతానికి చెందిన అక్బర్ ఖాన్ (27) ఫ్లంబర్, సంతోష్ నగర్ కు చెందిన మహ్మద్ ఈషా అలీ అతని స్నేహితుడు. 

అక్బర్ ఖాన్ కు ఓ యువతితో ప్రేమ వ్యవహారం ఉంది. ఆమెకు ఇటీవల వివాహమయ్యింది. కానీ, వారిద్దరూ తరచూ కలుసుకుంటున్నారని మహ్మద్ ఈషా అలీ యువతి భర్తకు చెప్పాడు. దీంతో మంగళవారం రాత్రి అక్బర్ ఖాన్ కత్తితో ఈషా ఆలీపై దాడికి పాల్పడ్డాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్ ఐ రాజేందర్ తెలిపారు.  

ఇదిలా ఉండగా, మరోవైపు మెదక్ జిల్లా మాసాయి పేట మండలం చెట్ల తిమ్మాయిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. వివాహేతర సంబంధం నేపత్యంలో లక్ష్మణ్ అనే వ్యక్తిపై నర్సింహులు అనే వ్యక్తి గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. 

లక్ష్మణ్ పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు అతడిని ఆసుపత్రిలో తరలించారు. ఆగ్రహంలో నర్సింహులు ఇంటికి లక్ష్మణ్ కుటుంబ సభ్యులు నిప్పు పెట్టారు. ఇరు వర్గాల ఘర్షణలో గ్రామంలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. 

PREV
click me!

Recommended Stories

Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?
Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...