గడ్డి అన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌‌లో కూల్చివేతలు: నిలిపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం

By narsimha lodeFirst Published Mar 8, 2022, 4:06 PM IST
Highlights

గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ లో కూల్చివేతలను నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు ఆదేశించింది. ఇవాళ ఉదయం నుండి ఈ మార్కెట్ లో కూల్చివేతలను జీహెచ్ఎంసీ ప్రారంభించింది.

హైదరాబాద్: Gaddi Annaram ఫ్రూట్ మార్కెట్ లో కూల్చివేతలు ఆపాలని  తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు ఆదేశించింది.Fruit Marketలో వ్యాపారులకు సంబంధించిన వస్తువులను తరలించేందుకు కూడా అనుమతించాలని కూడా  Telangana High Court ఆదేశించింది. గడ్డి అన్నారం మార్కెట్ లో కూల్చివేతలు దురదృష్టకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. మార్కెటింగ్  ప్రిన్సిపల్ సెక్రటరీని కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ పై ఈ నెల 14న విచారణ చేయనుంది ఉన్నత న్యాయస్థానం.

ఇవాళ ఉదయం నుండి గడ్డిఅన్నారం మార్కెట్ లో కూల్చివేతలను GHMC  ప్రారంభించింది. అయితే ఈ కూల్చివేతలను అడ్డుకొనేందుకు వ్యాపారులు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

నిమ్స్‌ పక్కనే ఉన్న 18 ఎకరాల ఎర్రమంజిల్‌ స్థలంలో నిమ్స్‌ను విస్తరిస్తారు. అక్కడి క్వార్టర్లను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు నగరానికి నాలుగు దిక్కుల నాలుగు టిమ్స్‌ ఆస్పత్రులను 1000 పడకలతో నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. గచ్చిబౌలిలో ఇప్పటికే ఉన్న టిమ్స్‌లో మరికొన్ని భవనాలు నిర్మిస్తారు. సనత్‌నగర్‌ ఛాతీ ఆస్పత్రి, ఎల్బీ నగర్‌ వద్ద గడ్డి అన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌, ఆల్వాల్‌.. ఇలా మరో మూడు ప్రాంతాల్లో మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించనున్నారు.  అయితే ఈ కారణంగానే గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ను బాట సింగారానికి తరలించారు. 

నగరంలో నిర్మించే ఆస్పత్రులన్నీ ఎయిమ్స్‌ తరహాలో ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎయిమ్స్‌లను ఒక్కోక్కటి 14 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు. మన దగ్గర మాత్రం 12 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించే అవకాశం ఉంది. కన్సల్టెన్సీలు ఇప్పటికే సర్వే పనులు ప్రారంభించాయి. సర్కారు జీవో జారీ చేయగానే రోడ్లు, భవనాల శాఖ టెండర్లు పిలవనుంది. ఈ ప్రక్రియ అంతా ఈ నెలాఖరుకే పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. నగరంలో నిర్మించే ఆస్పత్రులకు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. 

 

ఈ ఆసుపత్రుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కార్పోరేషన్న ు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం రూ.21 వేల కోట్ల రుణాన్ని ఎస్బీఐ కేపిటల్ అందించనుంది.   . 1000 పడకలతో నిర్మించే ప్రతి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి రూ.900 కోట్ల ఖర్చవుతుందని అంచనా. నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు, మెడికల్‌ ఎక్వి‌ప్ మెంట్‌తో కలుపుకొని ఈ మేరకు అంచనా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక నిమ్స్‌ ఆస్పత్రికి రూ.2 వేల కోట్లు అవుతుందంటున్నారు. 

వరంగల్‌తో కలుపుకొని 6 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, 8 మెడికల్‌ కాలేజీలు, 16 నర్సింగ్‌ కాలేజీలను శరవేగంగా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటి నిర్మాణ బాధ్యతను ఇప్పటికే రోడ్లు భవనాల శాఖకు అప్పగించారు. ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణ బాధ్యతను సాధారణంగా తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ పర్యవేక్షిస్తుంటుంది. 

 

click me!