అందుకే ఎమ్మెల్యేల సస్పెన్షన్ : బీజేపీకి బాల్క సుమన్ కౌంటర్

Published : Mar 08, 2022, 03:37 PM IST
అందుకే ఎమ్మెల్యేల సస్పెన్షన్ : బీజేపీకి బాల్క సుమన్ కౌంటర్

సారాంశం

బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ వెల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతోనే సభ నుండి బీజేపీ ఎమ్మెల్యేలను సప్పెండ్ చేయాల్సి వచ్చిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పారు. 

హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని  టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. స్పీకర్ వెల్‌లోకి వెళ్లేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించినందునే స్పీకర్ వారిని సభ నుండి సస్పెండ్ చేసినట్టుగా చెప్పారు. తమను అన్యాయంగా సభ నుండి సస్సెండ్ చేశారని BJP  ఎమ్మెల్యేల కామెంట్స్ పై Balka Suman  స్పందించారు. ప్రణాళిక బద్దంగానే బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారని ఆయన విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేలు తమ పద్దతిని మార్చుకోవాలని సుమన్ సూచించారు. చట్ట సభల నుండి ప్రజా ప్రతినిధులను సస్పెండ్ చేయడం ఇదేమీ కొత్త కాదన్నారు.  హిమాచల్ ప్రదేశ్ లో ఐదుగురు Congress  ఎమ్మెల్యేలు సస్పెండ్ చేశారని ఆయన చెప్పారు.

కర్ణాటకలో Congress ఎమ్మెల్యేను వారంరోజుల పాటు సస్పెండ్ చేసిన విషయాన్ని  ఆయన గుర్తు చేశారు. తెలంగాణకు రావాల్సిన వాటా కోసం  బీజేపీ ప్రజా ప్రతినిధులు ప్రయత్నించాలని TRS ఎమ్మెల్యే కోరారు.  తెలంగాణకు నిధుల కోసం ప్రదాని, హోం మంత్రి ఆఫీస్ ల వద్ద ధర్నా చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుమన్  హితవు పలికారు.


Telangana Assembly Budget session ప్రారంభమైన తొలి రోజే   బీజేపీ సభ్యులపై suspension వేటు పడింది. ఈ  అసుంబ్లీ సమావేశాలు ముగిసేవరకు వారిపై సస్పెన్షన్ వేటు పడింది.సోమవారం నాడు  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే శాసనసభలో మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం కొనసాగిస్తుండగా బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే హరీష్ రావు తన ప్రసంగానికి స్వల్ప విరామం ఇచ్చారు. 

బీజేపీ సభ్యులు రఘునందన్ రావు, రాజాసింగ్, ఈటల రాజేందర్‌లను ఈ సెషన్ ముగిసేవరకు శాసనసభ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రావు తీర్మానాన్ని ప్రతిపాదించారు.  శాసనసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్‌లు అసెంబ్లీ గేటు బయట కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్ కూడా తప్పు బట్టింది. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా టీఆర్ఎస్ సర్కార్ వ్యవహరిస్తుందని కాంగ్రెస్ అభిప్రాయపడింది. స్పీకర్ నియమ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నాడని టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి విమర్శించారు. స్పీకర్ తీరుపై తెలంగాణ గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి సోమవారం నాడు ప్రకటించారు. మరో వైపు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సోమవారం నాడే ఈ విషయమై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై రాష్ట్రపతికి కూడా బీజేపీ ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేయనున్నారు.

ఇదిలా ఉంటే సస్పెన్షన్ పై బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏ నిబంధన కింద తమను సస్పెండ్ చేశారో చెప్పాలని కోరారు. విషయమై కేసీఆర్ సర్కార్ ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. 
 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu