మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేసి నివేదిక : చర్ల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు

By narsimha lodeFirst Published Sep 24, 2020, 5:00 PM IST
Highlights

చర్ల ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ముగ్గురి మృతదేహాలను రీ  పోస్టుమార్టం చేసి  రిపోర్టును సీల్డ్ కవర్లో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
 


హైదరాబాద్: చర్ల ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ముగ్గురి మృతదేహాలను రీ  పోస్టుమార్టం చేసి  రిపోర్టును సీల్డ్ కవర్లో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

చర్ల ఎన్ కౌంటర్ పై పౌరహక్కుల సంఘం లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై గురువారం నాడు తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. చనిపోయిన ముగ్గురి మృతదేహాలను భద్రపర్చాలని పిటిషనర్ కోరారు. ఎన్‌కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై 302 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలని పిటిషనర్ డిమాండ్ చేశారు.

ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను ఫోరెన్సిక్ నిపుణులతో  రీపోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ను పిటిషనర్ కోరారు. అయితే ఇప్పటికే  మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. 

రీ పోస్టుమార్టం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో మావోయిస్టుల కదలికలు మొదలయ్యాయి. మావోలు రిక్రూట్ మెంట్ పెంచుకొంటున్నారని తెలంగాణ పోలీస్ శాఖ అనుమానిస్తుంది. ఈ క్రమంలోనే పోలీసులు కూంబింగ్ ను పెంచారు. మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు చోటు చేసుకొంటున్నాయి.

click me!