
హైదరాబాద్: నిజాబాబాద్ ఎంపీ Dharmapuri Aravind పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని Telangana High court పోలీసులను ఆదేశించింది. Banjara Hills లో నమోదైన కేసు విషయమై కూడా తెలంగాణ హైకోర్టును అరవింద్ ఆశ్రయించారు. తనపై నమోదైన fir ను కొట్టివేయాలని ఆ పిటిషన్ లో అరవింద్ కోరారు.
సీఎం kcr మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో ఐపీసీ 504, 55(2), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత ఏడాది నవంబర్ 8న ప్రెస్ మీట్ లో సీఎం మీద అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బంజారాహిల్స్ పీఎస్ లో బోయిన్ పల్లికి చెందిన వ్యాపారి కల్యాణ్ సందీప్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అర్వింద్ పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు నిజామాబాద్ జిల్లా మండలపేట పోలీసులు అర్వింద్‌పై ఎస్పీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టారు. దీనిని కొట్టేయాలని ఆయన బుధవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని అత్యవసర విచారణగా చేపట్టిన హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే హైద్రాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో బీజేపీ ఎంపీ అరవింద్ పై కోర్టులో కేసు నమోదైంది.