లిక్కర్ షాపులు, థియేటర్లపై ఆంక్షలు ఎందుకు లేవు: తెలంగాణ హైకోర్టు ప్రశ్న

By narsimha lodeFirst Published Apr 6, 2021, 12:45 PM IST
Highlights

మద్యం దుకాణాలు, బార్లు, పబ్ లు, థియేటర్లపై ఆంక్షలు ఎందుకు విధించడం లేదో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
 

హైదరాబాద్: మద్యం దుకాణాలు, బార్లు, పబ్ లు, థియేటర్లపై ఆంక్షలు ఎందుకు విధించడం లేదో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

తెలంగాణలో కరోనా పరిస్థితులపై  మంగళవారం నాడు  హైకోర్టు విచారణ నిర్వహించింది.  ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం రాపిడ్ టెస్టులపైనే దృష్టి పెట్టడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.పరీక్షలు నెమ్మదిగా పెంచుతున్నామని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ నివేదించారు. కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తోందని ఈ తరుణంలో కూడ నెమ్మదిగా పరీక్షలు పెంచుతామని చెప్పడం ఏమిటని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆర్టీపీసీఆర్ పరీక్షలను పెంచాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కరోనా పరిస్థితులపై విచారణ సందర్భంగా 
కరోనా పరీక్షలు, చికిత్స, నియంత్రణపై నివేదిక టీఎస్ సర్కార్ హైకోర్టుకు నివేదికను అందించింది.అనాధ, వృద్ధాశ్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా నిబంధనలు అమలుకు ఎలాంటి చర్యలు తీసుకొన్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది  48 గంటల్లోపుగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోోజుకి పెరిగిపోతున్నాయి. ఈ కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు గాను  మాస్కులు, భౌతిక దూరం పాటించాలని కూడ వైద్యశాఖ నిపుణులు సూచిస్తున్నారు. 
 

click me!