కర్ఫ్యూ లేదా వీకేండ్ లాక్‌డౌన్‌పై 48 గంటల్లో నిర్ణయం: కరోనాపై తెలంగాణ సర్కార్‌కి హైకోర్టు ఆదేశం

By narsimha lode  |  First Published Apr 19, 2021, 5:13 PM IST

రాష్ట్రంలో నమోదౌతున్న  కరోనా కేసులను పురస్కరించుకొని  48 గంటల్లో  వీకేండ్ లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ పైప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
 


హైదరాబాద్: రాష్ట్రంలో నమోదౌతున్న కరోనా కేసులను పురస్కరించుకొని  48 గంటల్లో వీకేండ్ లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ పైప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.సోమవారం నాడు  కరోనా కేసులపై  తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది.  48 గంటల్లో  ఈ విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే  తామే ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు  తేల్చి చెప్పింది. 

also read:పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా?.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు..

Latest Videos

undefined

జీహెచ్ఎంసీలో   నమోదైన కేసులు వార్డుల వారిగా కోర్టుకు సమర్పించాలన్న హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆసుపత్రుల్లో  సలహాలు ఇవ్వడానికి నోడల్ అధికారి ని  నియమించారా అని  హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు కోవిడ్ వివరాలను  వెబ్ సైట్ లో నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పెళ్లిళ్లు, శుభకార్యాలలో పబ్లిక్ ప్లేస్ లలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. డిజీపీ, ఆరోగ్య అధికారులు ఇచ్చిన నివేదిక తప్పులు తడక గా ఉందని  హైకోర్టు అభిప్రాయపడింది. 

రాష్ట్ర సరిహద్దుల్లో కరోనా పరీక్షలు నిర్వహించాలని  ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 22వ స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 10 రోజుల క్రితం ఇచ్చిన ఆదేశాలను ఇప్పటికీ అమలు చేయడం లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.  పెళ్లిళ్లు, అంత్యక్రియలు, ఎన్నికల ర్యాలీలపై ఏం చర్యలు తీసుకొన్నారని  హైకోర్టు ప్రశ్నించింది.  

ఢిల్లీలో లాక్‌డౌన్ విధించిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది.  మద్యం దుకాణాల వద్ద పెద్ద ఎత్తున  జనం బారులు తీరుతున్న విషయాన్ని హైకోర్టు ప్రశ్నించింది.  కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా  వ్యవహరిస్తున్నామని  తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖాధికారులు హైకోర్టుకు తెలిపారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితుల పై మరోసారి తీసుకున్న చర్యలపై పూర్తి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.  ఆర్టీపీసీఆర్ రిపోర్టు 24 గంటల్లో వచ్చేలా చూడాలని  ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణను ఈ నెల 23 వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. 
 

click me!