వైద్యులకు పీపీఈ కిట్స్, మాస్కులు అందించాలి: తెలంగాణ హైకోర్టు ఆదేశం

By narsimha lodeFirst Published Apr 21, 2020, 4:29 PM IST
Highlights

:కరోనా నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను మరోసారి పూర్తి వివరాలతో తమకు అందించాలని హైకోర్టు ఆదేశించింది.


హైదరాబాద్:కరోనా నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను మరోసారి పూర్తి వివరాలతో తమకు అందించాలని హైకోర్టు ఆదేశించింది.

మంగళవారం నాడు తెలంగాణ హైకోర్టు వీడియో కాన్పరెన్స్ ద్వారా  కరోనా నివారణ చర్యలపై విచారణ చేసింది.కరోనా సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు పీపీఈ కిట్స్, మాస్కులను అందించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పండ్లు, కూరగాయల కొనుగోలు సమయంలో సోషల్ డిస్టెన్స్ ను పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.

also read:సూర్యాపేటలో కరోనా వ్యాప్తిపై ఆందోళన: ప్రత్యేకాధికారిగా వేణుగోపాల్ రెడ్డి

కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొన్న విషయాన్ని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు. రాష్ట్రంలో 329 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసిన విషయాన్ని ఏజీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ప్రతి జిల్లాలో కరోనా కోసం ప్రత్యేక సెంటర్‌ను ఏర్పాటు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. మరోసారి పూర్తి వివరాలతో  వివరాలను అందించాలని హైకోర్టు కోరింది. ఈ పిటిషన్ పై విచారణను మే 8వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.

click me!