సూర్యాపేటలో కరోనా వ్యాప్తిపై ఆందోళన: ప్రత్యేకాధికారిగా వేణుగోపాల్ రెడ్డి

By telugu teamFirst Published Apr 21, 2020, 4:17 PM IST
Highlights

సూర్యాపేటలో కరోనా వైరస్ వ్యాప్తిపై తెలంగాణ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి సూర్యాపేటకు వేణుగోపాల్ రెడ్డిని ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్: సూర్యాపేటలో కరోనా వైరస్ వ్యాప్తిపై తెలంగాణ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కోవిడ్-19 తీవ్రత నేపథ్యంలో సూర్యాపేట మున్సిపాలిటికి ప్రత్యేకాధికారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాల మేరకు సూర్య పేటకు ఓఎస్డి నియామకం జరిగింది.ప్రస్తుతం మున్సిపల్ పరిపాలన శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి. వేణు గోపాల్ రెడ్డిని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డి) నియమిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి  ఉత్తర్వులు జారీ చేశారు.  దాంతో ప్రత్యేకాధికారి (ఓఎస్డీ) వేణుగోపాల్ రెడ్డి హుటా హుటిన సూర్యా పేటకు బయలు దేరి వెళ్లారు. ఆయన గతంలో ఖమ్మం, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేశారు.

కరోనా వైరస్ వ్యాప్తిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సమీక్ష చేస్తున్నారు. సూర్యాపేటలో అనూహ్యంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. పరిస్థితి ఆందోళనకరంగా కూడా ఉంది.

click me!