టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు.. ఎందుకోసమంటే..?

Published : Jun 23, 2022, 01:09 PM IST
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు.. ఎందుకోసమంటే..?

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ పార్టీకి భూమి కేటాయింపుకు సంబంధించి ఈ నోటీసులు జారీ అయ్యాయి. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ పార్టీకి భూమి కేటాయింపుకు సంబంధించి ఈ నోటీసులు జారీ అయ్యాయి. వివరాలు.. బంజారాహిల్స్‌లో ఎన్బీటీ నగర్‌లో టీఆర్ఎస్‌కు భూమి కేటాయింపులపై హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం భూమి కేటాయింపును సవాల్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగి మహేశ్వర్‌రాజ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అత్యంత ఖరీదైన భూమిని గజానికి రూ.100 చొప్పున కేటాయించారని చెప్పారు. 

హైదరాబాద్ సహా మిగిలిన జిల్లాలో కూడా టీఆర్‌ఎస్ కార్యాలయాలకు ఇదే తరహాలో భూమిని కేటాయించారని కోర్టు తెలిపారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన హైకోర్టు.. తెలంగాణ సీఎస్, సీసీఎల్‌ఏ, రెవెన్యూ సీఎస్‌, హైదరాబాద్‌ కలెక్టర్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్