మొయినాబాద్ ఫాంహౌస్ కేసు... నిందితులకు షాకిచ్చిన హైకోర్ట్, దర్యాప్తుపై స్టే ఎత్తివేత

By Siva Kodati  |  First Published Nov 8, 2022, 4:37 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుల దర్యాప్తుపై విధించిన స్టే ఎత్తివేసింది. 
 


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుల దర్యాప్తుపై విధించిన స్టే ఎత్తివేసింది. కేసును దర్యాప్తు చేయవచ్చని తెలంగాణ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా... గత నెల 26న మొయినాబాద్ ఫాం హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలు చేస్తున్నారనే ఆరోపణలతో రామచంద్రభారతి ,సింహయాజీ, నందకుమార్ లను మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పిర్యాదు మేరకు  పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్  చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యేరేగా కాంతారావు ,తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ఈ ముగ్గురు నిందితులు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని టీఆర్ఎస్ ఆరోపించింది. దీని వెనుక బీజేపీ ఉందని కూడ గులాబీ పార్టీ  తెలిపింది. అయితే ఈ  ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఈ విషయమై ఆడియో, వీడియోలను  కూడ టీఆర్ఎస్ విడుదల చేసింది.

Latest Videos

click me!