ఎల్ఆర్ఎస్: తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

By narsimha lodeFirst Published Apr 28, 2021, 3:46 PM IST
Highlights

సుప్రీంకోర్టు నిర్ణయించే వరకు ఎల్ఆర్ఎస్ అమలుకు బలవంతపు చర్యలు చేపట్టవద్దని  తెలంగాణ ప్రభుత్వాన్ని బుధవారం నాడు  హైకోర్టు ఆదేశించింది.
 

హైదరాబాద్: సుప్రీంకోర్టు నిర్ణయించే వరకు ఎల్ఆర్ఎస్ అమలుకు బలవంతపు చర్యలు చేపట్టవద్దని  తెలంగాణ ప్రభుత్వాన్ని బుధవారం నాడు  హైకోర్టు ఆదేశించింది.ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌పై  ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.  అనధికార లేఅవుట్ లు, భవనాల క్రమబద్ధీకరణ పై హైకోర్టులో విచారణ నిర్వహించింది.

also read:కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్: ఇక నుండి ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు

ఎల్ఆర్ఎస్ పై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ లో ఉందని  రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ పిటిషన్ పై  సుప్రీంకోర్టులో ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని  రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. సుప్రీంకోర్టులో ఇదే విషయమై పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున తాము విచారణ జరపాల్సిన అవసరం లేదని హైకోర్టు తెలిపింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పై దాఖలైన పిటిషన్లన్నింటిపై విచారణను హైకోర్టు ముగించింది. గత ఏడాదిలో ఎల్ఆర్ఎస్ ఫీజును పెంచుతూ  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఈ ఫీజును తగ్గిస్తూ  నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ ఏడాది జనవరి మాసంలోనే  ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకవాల్సి ఉంది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పై పలువురు హైకోర్టుతో పాటు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 

click me!