ప్రజాప్రతినిధులపై కేసులు: విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశం

By Siva KodatiFirst Published Oct 3, 2020, 6:53 PM IST
Highlights

ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణ చేపట్టాలని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. రోజువారీ విచారణ చేపట్టాలని ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులు విచారిస్తున్న కోర్టులను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ జరపాలని సూచించింది

ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణ చేపట్టాలని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. రోజువారీ విచారణ చేపట్టాలని ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులు విచారిస్తున్న కోర్టులను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ జరపాలని సూచించింది.

గత నెల 17న సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ప్రస్తుత, మాజీ ప్రజా పతినిధుల క్రిమినల్ కేసుల విచారణకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

కేసుల విచారణకు ప్రణాళిక సిద్ధం చేసి పంపాలని అన్ని రాష్ట్రాల హైకోర్టులను ఆదేశించింది. జిల్లాలో పెండింగ్ కేసులు, ప్రత్యేక కోర్టులను పరిగణనలోనికి తీసుకోవాలని.. ఈ మేరకు ప్రణాళిక తయారు చేయాలని సూచించింది.

కాగా పలుకుబడిగల నేతలపై క్రిమినల్‌ కేసుల విచారణ అత్యంత వేగంగా జరపాలని 2012 మార్చిలో లా కమిషన్‌ సిఫారసు చేసింది. పోలీసులను, సాక్షులను ప్రభావితం చేస్తూ విచారణలకు హాజరుకాకుండా సాధ్యమైనంత ఆలస్యం చేస్తున్నారని లా కమిషన్‌ పేర్కొంది.

ప్రజాస్వామ్య పాలనలో కీలక పాత్ర పోషించాల్సిన ప్రజా ప్రతినిధులు స్వచ్ఛంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని, ప్రజలు కూడా వారిపై విచారణ త్వరగా ముగియాలని ఆశిస్తారని లా కమిషన్‌ వివరించింది. 

click me!