ఎన్నికలు వాయిదా వేయలేం, ఎస్ఈసీదే నిర్ణయం: షబ్బీర్ అలీ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు

By narsimha lodeFirst Published Apr 19, 2021, 3:35 PM IST
Highlights

మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని  కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు ఆదేశించింది.

 హైదరాబాద్:మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని  కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు ఆదేశించింది. రాష్ట్రంలో ముప్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది.

also read:మున్సిపల్ ఎన్నికల వాయిదా... హైకోర్టును ఆశ్రయించిన షబ్బీర్ అలీ

ఎన్నికలు నిలిపివేయాలని ఆదేశించలేమని హైకోర్టు తెలిపింది. అయితే ఈ విషయమై ఎస్ఈసీనే నిర్ణయం తీసుకొంటుందని హైకోర్టు ప్రకటించింది. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు సోమవారం నాడు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై విచారణను జూన్ 7వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలతో పాటు మరో ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. ఈ మున్సిపాలిటీల్లో నామినేషన్లు దాఖలుకు కూడా గడువు ముగిసింది. 

click me!