మునుగోడులో ఓటర్ల నమోదు ప్రక్రియపై తెలంగాణ హైకోర్టులో విచారణ..

Published : Oct 13, 2022, 12:25 PM IST
మునుగోడులో ఓటర్ల నమోదు ప్రక్రియపై తెలంగాణ హైకోర్టులో విచారణ..

సారాంశం

మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక వేళ ఓటర్ల నమోదు అభ్యంతరాలపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ చేపట్టింది. మునుగోడు ఓటర్ల జాబితా నివేదికను సమర్పించాలని ఎలక్షన్ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. 

మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక వేళ ఓటర్ల నమోదు అభ్యంతరాలపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ చేపట్టింది. మునుగోడు ఓటర్ల జాబితా నివేదికను సమర్పించాలని ఎలక్షన్ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. అనంతరం మునుగోడు ఓటర్ల నమోదు ప్రక్రియపై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే మునుగోడులో కొత్తగా నమోదైన 25 వేల ఓట్లలో.. 7 వేలు తొలగించామని ఎలక్షన్ కమిషన్  తెలిపింది.

ఇక, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో చివరి నిమిషంలో ఎక్కువ మంది ఓటర్లను చేర్పించే ప్రయత్నాలను అనుమతించవద్దని బీజేపీ మంగళవారం హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మునుగోడులో చివరి నిమిషంలో 25,000 మంది కొత్త ఓటర్లను చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. 2022 జూలై 31లోగా నమోదు చేసుకున్న వారిని మాత్రమే చెల్లుబాటు అయ్యే ఓటర్లుగా పరిగణించాలని ఎన్నికల అధికారులను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. 

మునుగోడు నియోజకవర్గంలోని మునుగోడు, చండూరు మండలాల్లో గత 7 నెలల్లో కొత్త ఓటర్ల నమోదు కోసం 1,474 క్లెయిమ్‌లు వచ్చాయని.. అయితే గత రెండు నెలల్లో ఈ సంఖ్య ఇప్పుడు 25,000కు చేరుకుందని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అక్టోబర్ 14న కొత్త ఓటరు జాబితాను ప్రకటించేందుకు ఎన్నికల అధికారులు సమాయత్తమవుతున్నారని.. అధికారులు అలా చేయకుండా అడ్డుకోవాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టును.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇక, మునుగోడులో నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu