మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో ఊరట..ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్ కొట్టివేత..

Published : Oct 10, 2023, 10:51 AM ISTUpdated : Oct 10, 2023, 10:52 AM IST
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో ఊరట..ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్ కొట్టివేత..

సారాంశం

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో ఊరట దొరికింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ 2019లో వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 

హైదరాబాద్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో ఊరట లభించింది.  ఆయన ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. రాఘవేంద్రరాజు అనే పిటిషనర్ వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని పిటిషనర్ ఆరోపించారు. పిటిషనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు.

కాగా, 2019లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చేయలేదంటూ మహబూబ్నగర్ కు చెందిన రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2018 ఎన్నికల సమయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమర్పించిన ఎన్నికల అఫీడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మొదట రిటర్నింగ్ అధికారికి అఫిడవిటిను సమర్పించి... మళ్ళీ వెనక్కి తీసుకున్నారని..  ఆ తర్వాత సవరించి ఇచ్చారని ఆరోపించారు. 

ఇలా చేయడం టాంపరింగ్ కిందికి వస్తుందని.. చట్టవిరుద్ధమని..  మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికను రద్దు చేయాలని పిటిషనర్ రాఘవేంద్ర రాజు హైకోర్టును కోరారు. దీని మీద విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు  ఈ వివాదం మీద తీర్పును నేటికి వాయిదా వేసింది. దీని మీద విచారణ చేసిన హైకోర్టు మంగళవారం నాడు  పిటిషన్ను కొట్టివేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !