గర్భందాల్చిన అత్యాచార బాధితురాలు: అబార్షన్‌పై హైకోర్టు సంచలన తీర్పు

By Siva Kodati  |  First Published Oct 7, 2021, 9:39 PM IST

తెలంగాణ హైకోర్టు (telangana high court) గురువారం సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారంతో బాలిక దాల్చిన గర్భం (unwanted pregnancy) తొలగింపునకు అనుమతిచ్చింది. 16 ఏళ్ల బాలిక 26 వారాల పిండాన్ని తొలగించాలని కోఠి ప్రసూతి ఆసుపత్రి (koti hospital) సూపరింటెండెంట్‌ను హైకోర్టు ఆదేశించింది. 


తెలంగాణ హైకోర్టు (telangana high court) గురువారం సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారంతో బాలిక దాల్చిన గర్భం (unwanted pregnancy) తొలగింపునకు అనుమతిచ్చింది. 16 ఏళ్ల బాలిక 26 వారాల పిండాన్ని తొలగించాలని కోఠి ప్రసూతి ఆసుపత్రి (koti hospital) సూపరింటెండెంట్‌ను హైకోర్టు ఆదేశించింది. నిపుణులతో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. తొలుత బాలికకు అబార్షన్‌ చేసేందుకు కోఠి ఆసుపత్రి నిరాకరించడంతో ఆమె తల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించారు. పిండం హక్కుల కన్నా అత్యాచార బాధితురాలి హక్కులే ముఖ్యమని న్యాయమూర్తి స్పష్టం చేసింది. చట్టాన్ని అనుసరించి అవాంఛనీయ గర్భం వద్దనుకునే హక్కు ఉంటుందని హైకోర్టు ఈ సందర్భంగా తెలిపింది.  

click me!