బండి సంజయ్‌కి ఊరట.. ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

Siva Kodati |  
Published : Aug 25, 2022, 05:16 PM ISTUpdated : Aug 25, 2022, 05:25 PM IST
బండి సంజయ్‌కి ఊరట.. ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

సారాంశం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పాదయాత్రకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ మేరకు బండి సంజయ్‌కి ఏసీపీ ఇచ్చిన నోటీసును హైకోర్ట్ సస్పెండ్ చేసింది. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పాదయాత్రకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ మేరకు బండి సంజయ్‌కి ఏసీపీ ఇచ్చిన నోటీసును హైకోర్ట్ సస్పెండ్ చేసింది. 

కాగా.. ప్రజా సంగ్రామ యాత్రపై వర్ధన్నపేట ఏసీపీ ఇచ్చిన ,నోటీసును సవాల్ చేస్తూ బీజేపీ నేతలు ఈ నెల 23న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై నిన్న హైకోర్టు విచారణ జరిపింది. అనంతరం విచారణను ఇవాళ ఉదయానికి వాయిదా వేసింది. అయితే ఈ పిటిషన్ ను విచారణ చేసిన జస్టిస్ లలితకుమారి సెలవులో ఉండడంతో ఈ పిటిషన్ జస్టిస్ వినోద్ కుమార్ బెంచీకి మారింది. 

ఇదిలావుండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విషయమై ఆందోళన చేసిన బీజేపీ శ్రేణులపై  హైద్రాబాద్ పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్రలో బస చేసిన చోటునే బండి సంజయ్ దీక్షకు ప్రయత్నించారు. దీంతో నెల 23న బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్ లోని ఆయన ఇంటికి తరలించారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న  ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని వర్ధన్నపేట ఏసీపీ బండి సంజయ్ కు నోటీసులు జారీ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Money Earning Tips : మేడారం జాతరలో పెట్టుబడి లేకుండానే లక్షలు సంపాదించండి.. టాప్ 5 బిజినెస్ చిట్కాలు
IMD Rain Alert : దేశవ్యాప్తంగా వర్షాలు, ఈ తెలుగు జిల్లాల్లోనూ.. ఎల్లో అలర్ట్ జారీ