తెలంగాణ: 50 శాతం బెడ్లు రెడీ చేయండి.. ప్రైవేట్ ఆసుపత్రులకు సర్కార్ ఆదేశం

By Siva KodatiFirst Published Apr 6, 2021, 5:23 PM IST
Highlights

అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా రోగుల కోసం 50 శాతం బెడ్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు. మంగళవారం ప్రైవేట్ ఆసుపత్రుల యజమాన్యాలతో ఆయన సమావేశమయ్యారు

అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా రోగుల కోసం 50 శాతం బెడ్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు. మంగళవారం ప్రైవేట్ ఆసుపత్రుల యజమాన్యాలతో ఆయన సమావేశమయ్యారు.

రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటంతో ఆసుపత్రులను అప్రమత్తం చేశారు. హోటల్స్‌లో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. లక్షణాలు కనిపించిన వారిని, పాజిటివ్‌గా కేసులు వచ్చిన వారిని హోటల్స్‌లో వుంచాలని శ్రీనివాసరావు తెలిపారు. 

మరోవైపు, తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,498 కొవిడ్‌ బారినపడ్డారని వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. వైరస్‌ ప్రభావంతో ఆరుగురు మరణించారు. కొత్తగా 245 మంది బాధితులు కోలుకున్నారు.

ఇవాళ నమోదైన కేసులతో రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 10 వేలకు చేరువయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9,993 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 5,323 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించింది. నిన్న 62,350 మంది శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది.

click me!