తెలంగాణ : సీఎస్ సోమేశ్ కుమార్‌కు కరోనా .. ఆయనను కలిసిన అధికారుల్లో ఆందోళన

By Siva KodatiFirst Published Apr 6, 2021, 4:33 PM IST
Highlights

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్‌లో సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం వైరస్ బారినపడుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్‌లో సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం వైరస్ బారినపడుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.

తనను ప్రత్యక్షంగా కలిసిన వారంతా ఐసోలేషన్‌లో ఉండి కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సీఎస్ కోరారు. మంగళవారం ఉదయం కూడా కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‍కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అంతకుముందు నిన్న సీఎం కేసీఆర్‍తో సోమేష్‍కుమార్ సమావేశమైయ్యారు. ఈ నేపథ్యంలో సీఎస్‌ను కలిసిన వారు ఆందోళనకు గురవుతున్నారు. 

మరోవైపు, తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,498 కొవిడ్‌ బారినపడ్డారని వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. వైరస్‌ ప్రభావంతో ఆరుగురు మరణించారు. కొత్తగా 245 మంది బాధితులు కోలుకున్నారు.

ఇవాళ నమోదైన కేసులతో రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 10 వేలకు చేరువయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9,993 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 5,323 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించింది. నిన్న 62,350 మంది శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది.

click me!