వరంగల్‌లో హెల్త్ వర్కర్ వనిత మృతి: విచారణకు తెలంగాణ ఆరోగ్య శాఖ ఆదేశం

By narsimha lodeFirst Published Jan 24, 2021, 5:27 PM IST
Highlights

 వరంగల్ లో హెల్త్ వర్కర్ వనిత మృతిపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఆరా తీస్తోంది.  వరంగల్ లో టీకా తీసుకొన్న హెల్త్ వర్కర్ మృతిపై ఎఈఎఫ్ఐ నివేదిక సిద్దం చేస్తోంది.


వరంగల్: వరంగల్ లో హెల్త్ వర్కర్ వనిత మృతిపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఆరా తీస్తోంది.  వరంగల్ లో టీకా తీసుకొన్న హెల్త్ వర్కర్ మృతిపై ఎఈఎఫ్ఐ నివేదిక సిద్దం చేస్తోంది.

ఈ నెల 19వ తేదీన హెల్త్ వర్కర్ వనిత  టీకా తీసుకొంది.  ఆ తర్వాత ఆమె అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించింది.కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే వనిత మరణించిందని  కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.  కానీ ఈ విషయమై నిర్ధారణ కాలేదని వైద్యశాఖాధికారులు తెలిపారు.

హెల్త్ కేర్ వర్కర్ మృతిపై  తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు  విచారణకు ఆదేశించారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే మృతి చెందిందా.. ఇతరత్రా కారణాలతో ఆమె మరణించిందా అనే కోణంలో కూడ వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఎఈఎఫ్ఐ తుది  నివేదిక ఆధారంగా చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా  కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 

 

click me!