
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 11న నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షను సవాలు చేస్తూ పలువురు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరీక్షను ఆపాలని నాలుగు పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. పిటిషన్లను కొట్టేసింది. దీంతో ఈ నెల 11న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు లైన్ క్లియర్ అయింది. దీంతో ఈ నెల 11న యథావిథిగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది.
ఇదిలా ఉంటే.. టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం వెలుగుచూసిన తర్వాత గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షతో పాటు పలు పరీక్షను రద్దు చేశారు. అయితే తాజాగా ఈ నెల 11న గ్రూప్ 1 పరీక్షను నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్దమైంది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను కూడా విడుదల చేసింది. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in / నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని కమిషన్ సూచించింది. అయితే పేపర్ లీక్ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎస్‌పీఎస్సీ చేతనే.. మళ్లీ పరీక్షను నిర్వహించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.