
గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 30 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల పంపిణీకి శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొంది. జూన్ 30న ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజున పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపడతారు. మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాల్లో పట్టాలను పంపిణీ చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2,845 గ్రామాలు , తాండాలు, గూడేల పరిధిలో వున్న 4,01,405 ఎకరాల పోడు భూములకు అధికారులు ఇప్పటికే పట్టాలను పంపిణీ చేశారు. వీటి ద్వారా 1,50,224 మంది గిరిజనులకు ప్రభుత్వ నిర్ణయం కారణంగా లబ్ధి చేకూరనుంది.