విదేశాల నుండి తెలంగాణ రాష్ట్రానికి సుమారు 20 వేల మంది వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విదేశాల నుండి వచ్చేవారిని వెంటనే క్వారంటైన్ కు తరలించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది
హైదరాబాద్: విదేశాల నుండి తెలంగాణ రాష్ట్రానికి సుమారు 20 వేల మంది వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విదేశాల నుండి వచ్చేవారిని వెంటనే క్వారంటైన్ కు తరలించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది.
హైద్రాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ కేంద్రం వద్ద వైద్యాధికారుల సంఖ్యను పెంచారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల ఈ స్క్రీనింగ్ టెస్ట్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
undefined
తెలంగాణ రాష్ట్రానికి విదేశాల నుండి మరో 20 వేల మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకొని ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం.వికారాబాద్, గాంధీ ఆసుపత్రులతో పాటు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో కూడ క్వారంటైన్ కేంద్రాలను ప్రభుత్వం సిద్దం చేస్తోంది.
Also read:కరోనా భయంతో ఆసుపత్రి భవనంపై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య
విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులపై ప్రభుత్వం నిఘా ఏర్పాటు చేసింది. విదేశాల నుండి వచ్చే ప్రయాణీకుల సమాచారంపై ఐదుగురు ఐఎఎస్ లతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సీనియర్ ఐఎఎస్ అధికారి సునీల్ శర్మ సభ్యుడిగా ఉన్నారు.విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులను 14 రోజుల పాటు క్వారంటైన్ కేంద్రాల్లోనే ఉంచనున్నారు.
గురువారం నాడు ఇప్పటికే 1500 మంది ప్రయాణీకులు విదేశాల నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొన్నారు.వీరిని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ కు తరలించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో 22 ఆర్టీసీ బస్సులను సిద్దం చేశారు. ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణీకులను నేరుగా క్వారంటైన్ సెంటర్లకు తరలించేందుకు ఈ బస్సులను ఉపయోగించనున్నారు.