విద్యార్థులకు అలర్ట్.. రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్..

తెలంగాణలో గత కొద్దిరోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చెరువులు, వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. 

Google News Follow Us

తెలంగాణలో గత కొద్దిరోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చెరువులు, వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అయితే రాగల మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థలకు రేపు(శుక్రవారం) కూడా సెలవు ప్రకటించింది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రేపు (జులై 28) అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు. 

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రబుత్వం.. ఇప్పటికే బుధ, గురు వారాల్లో రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలసిందే. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో.. శుక్రవారం కూడా సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక, శనివారం మొహర్రం, ఆ తర్వాత ఆదివారం కావడంతో విద్యార్థులకు వరుసగా సెలవులు వచ్చినట్టయింది.

Also Read: గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి.. భద్రాచలం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

ఇదిలాఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు  భారీ వర్షాలు , వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగానికి సహకరించేందుకుగాను పలు జిల్లాలకు పలువురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. 

1. ములుగు జిల్లా -  కృష్ణ ఆదిత్య, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సభ్య కార్యదర్శి. 
2 .భూపాల పల్లి  -  పి గౌతమ్, సెర్ప్, సీఈవో
3 . నిర్మల్          - ముషారఫ్ అలీ, ఎక్సైజ్ శాఖ, కమీషనర్ 
4 . మంచిర్యాల  - భారతి హోలికేరి, మహిళా, శిశు సంక్షేమ శాఖ, స్పెషల్ సెక్రెటరీ. 
5 . పెద్దపల్లి        - సంగీత సత్యనారాయణ, 
6 .ఆసిఫాబాద్     - హన్మంత రావు, పంచాయితీరాజ్ శాఖ కమీషనర్