
హైదరాబాద్:ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుండి అన్ని విద్యాసంస్థలను పున: ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.తెలంగాణలో విద్యా సంస్థలను తెరుచుకోవచ్చని వైద్య ఆరోగ్యశాఖ కూడ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే సీఎంఓకు నివేదికను అందించింది. విద్యా సంస్థలు తిరిగి తెరిచే విషయంలో సన్నద్దత విషయంలో విద్యాశాఖ కూడా ప్రభుత్వానికి రిపోర్టును పంపింది.
ప్రగతి భవన్ లో ఇవాళ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి విద్యా సంస్థల పున: ప్రారంభానికి సంబంధించి సీఎం కేసీఆర్ చర్చించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత సెప్టెంబర్ 1 నుండి విద్యాసంస్థల్లో ప్రత్యక్ష క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. విద్యా సంస్థల పున: ప్రారంభానికి విధి విధానాలను కూడ ప్రభుత్వం విడుదల చేయనుంది.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేసిన జూలై 1వ తేదీ నుండి విద్యాసంస్థలను ప్రారంభించాలని భావించింది. అయితే కరోనా థర్డ్‌వేవ్ వస్తోందని నిపుణులు హెచ్చరించడంతో విద్యాసంస్థలను తెరవలేదు.సెప్టెంబర్ 1వ తేదీ నుండి తిరిగి విద్యాసంస్థలను తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం అంగీకరించింది.