కిషన్ రెడ్డితో గద్దర్ భేటీ: అమిత్ షా అపాయింట్ మెంట్ కోరిన ప్రజా గాయకుడు

Published : Aug 23, 2021, 04:02 PM IST
కిషన్ రెడ్డితో గద్దర్ భేటీ: అమిత్ షా అపాయింట్ మెంట్ కోరిన ప్రజా గాయకుడు

సారాంశం

తనపై ఉన్న కేసుల విషయమై  చర్చించేందుకు గాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇప్పించాలని ప్రజా గాయకుడు గద్దర్ కోరారు. ఈ మేరకు ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఇవాళ గద్దర్ కలిశారు.

హైదరాబాద్:కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇప్పించాలని ప్రజా గాయకుడు గద్దర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. సోమవారం నాడు హైద్రాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో గద్దర్  భేటీ అయ్యారు. తనపై నమోదైన కేసుల విషయమై గద్దర్ కిషన్ రెడ్డితో చర్చించారు.

 దేశంలోని పలు రాష్ట్రాల్లో తనపై కేసులు నమోదైన విషయాన్ని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాలన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లి ఈ కేసులను  ఉపసంహరింపచేయాలని కోరుతానని చెప్పారు.

 1990లో అప్పటి ప్రభుత్వ పిలుపు మేరకు నక్సలైట్లను వదిలి జనజీవనస్రవంతిలో  కలిసిన విషయాన్ని గద్దర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు. 1997 ఏప్రిల్ 6న తనపై హత్యాయత్నం జరిగిందని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తన వెన్నుపూసలో ఉన్న బుల్లెట్ తనకు అనేక అనారోగ్య సమస్యలన తెచ్చి పెట్టిందన్నారు. ఇప్పటికీ తాను డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నానని ఆయన చెప్పారు.  తాను పరారీలో ఉన్నానని ప్రచారం చేయడం సరైందా అని ఆయన ప్రశ్నించారు.

 తనపై ఉన్న కేసులను ఎత్తివేయడంతో పాటు కేసుల విషయంలో న్యాయ సహాయం అందించడానికి సీఎం కేసీఆర్ చొరవ చూపాలని గద్దర్ కోరిన విషయం తెలిసిందే.గతంలో పీపుల్స్ వార్ ప్రస్తుత మావోయిస్టు పార్టీకి అనుబంధంగా ఉన్న జననాట్యమండలిలో గద్దర్ చురుకైన పాత్ర పోషించాడు.  తన  పాటల ద్వారా ఎందరినో  నక్సల్స్ ఉద్యమం వైపునకు ఆకర్షింపజేయడంలో కీలక పాత్ర పోషించారు.  దీంతో అప్పటి ప్రభుత్వాలు జననాట్యమండలిని నిషేధించిన విషయం తెలిసిందే.


 

PREV
click me!

Recommended Stories

Minister Sridhar Babu Comments: భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరిస్తాం | Asianet News Telugu
Hyderabad: నెల‌కు రూ. 67 ల‌క్ష‌ల అద్దె.. హైద‌రాబాద్‌లో ఫేస్‌బుక్ పెద్ద స్కెచ్