ప్రవీణ్ కుమార్ వీఆర్‌ఎస్‌కు తెలంగాణ సర్కార్ ఆమోదముద్ర.. విధుల నుంచి రిలీవ్

By Siva Kodati  |  First Published Jul 20, 2021, 5:33 PM IST

ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు విధుల నుంచి రిలీవ్ చేస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. గురుకులాలకు ఇంఛార్జ్‌గా రోనాల్డ్ రాస్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. 


ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు విధుల నుంచి రిలీవ్ చేస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. 

కాగా, ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఐపిఎస్ పదవి నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రవీణ్ కుమార్ రాజకీయ పార్టీని స్థాపిస్తారనే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది.

Latest Videos

undefined

Also Read:రాజకీయాల్లోకి రావడం తప్పు కాదు.. నా ప్రస్థానం అక్కడినుంచే.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తాను రాజీనామా కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం పనిచేయదలుచుకున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. 26 ఏళ్లు పాటు తన మాతృభూమికి ఐపిఎస్ అధికారిగా సేవ చేసినట్లు ఆయన తెలిపారు. పేద ప్రజలను కొత్త ప్రపంచంలోకి నడిపించే ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు. తన మనసుకు ఇష్టమైన పనులు తనకిష్టమైన రీతీలో చేస్తానని ఆయన చెప్పారు. ఫూలే, అంబేడ్కర్ మార్గంలో నడుస్తానని ఆయన చెప్పారు. 

ప్రవీణ్ కుమార్ 1995 బ్యాచ్ ఐపిఎస్ అాధికారి. దాదాపు దశాబ్ద కాలంగా ఆయన తెలంగాణ సామాజిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యా సంస్థల సొసెటీ కార్యదర్శిగా డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నారు. ఆయనను పలుమార్లు హిందూ సంస్థలు లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశాయి.

click me!