బంజారాహిల్స్ అత్యాచార ఘటనపై తమిళిసై సీరియస్... నివేదిక ఇవ్వాలని తెలంగాణ సర్కార్‌కు ఆదేశం

By Siva Kodati  |  First Published Oct 20, 2022, 6:58 PM IST

సఫిల్‌గూడ డీఏవీ స్కూల్ అత్యాచార ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. 


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సఫిల్‌గూడ డీఏవీ స్కూల్ అత్యాచార ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. బాలికపై స్కూల్ ప్రిన్సిపాల్ డ్రైవర్ వేధింపులపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె ఆదేశించారు. అలాగే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. 

Also REad:ఆటోలో ఒంటరిగా బాలిక... గ్యాస్ లేదనే సాకుతో నిర్మానుష్య ప్రాంతానికి, రైతులే రాకుంటే

Latest Videos

కాగా... బంజారాహిల్స్‌లోని ఓ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారిపై అదే పాఠశాల ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజనీ కుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రిన్సిపాల్ గదికి పక్కనే ఈ దారుణం జరిగినా ప్రిన్సిపాల్ మాధవి నిరోధించకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రజనీ కుమార్‌తో పాటు ప్రిన్సిపాల్ ఎస్ మాధవీపైనా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వీరిద్దరికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. 
 

click me!