నానక్‌రామ్‌గూడలో వివాహితపై అత్యాచారం, హత్య : నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎస్ .. డీజీపీలకు తమిళిసై ఆదేశం

Siva Kodati |  
Published : Aug 29, 2023, 04:20 PM IST
నానక్‌రామ్‌గూడలో వివాహితపై అత్యాచారం, హత్య : నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎస్ .. డీజీపీలకు తమిళిసై ఆదేశం

సారాంశం

హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో మహిళపై అత్యాచారం, హత్య ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, సైబరాబాద్ సీపీలను గవర్నర్ ఆదేశించారు. 

ALso Read: మీర్‌పేట్‌‌లో బాలికపై గ్యాంగ్‌రేప్.. తమిళిసై దిగ్భ్రాంతి, నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎస్ , డీజీపీలకు ఆదేశం

కాగా.. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఓ నిర్మాణ సంస్థలో దారుణం జరిగింది. ఓ మహిళపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడి ఆపై దారుణంగా హత్య చేశారు. బాధితురాలిని గౌలిదొడ్డి కేశవనగర్ వడ్డెర బస్తీకి చెందిన 38 ఏళ్ల కాశమ్మగా గుర్తించారు. మృతురాలు తుక్కు సామాగ్రి తెచ్చుకునేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై బండరాయితో మోది హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. గత శుక్రవారం నుంచి బాధితురాలు కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు ఆదివారం గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె వున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?