
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. నేడు నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికి హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. చాలా కింది స్థాయి నుంచి వచ్చారని... చాలా సింపుల్ పర్సన్ అని చెప్పారు. ఆమె రాష్ట్రపతి కావడం మహిళలకు దక్కిన గౌరవంగా అని చెప్పారు. మహిళా రాష్ట్రపతి కింద మహిళా గవర్నర్‌గా పని చేయడం సంతోషంగా ఉందన్నారు.
వర్షాలు వచ్చాయి కాబట్టి వరద ప్రాంతాల్లో తిరిగానని గవర్నర్ తమిళిసై అన్నారు. తాను రాష్ట్రానికి ప్రథమ పౌరురాలిని కాబట్టే ప్రజల దగ్గరికి వెళ్లానని స్పష్టం చేశారు. తాను వరదల వల్ల నష్టపోయిన భద్రాచలం వెళ్లానని.. అక్కడ తాను కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నానని.. అక్కడ ఆదివాసీలే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. వర్షాలపై రిపోర్టుని కేంద్రం హోంశాఖ మంత్రి ఇచ్చానని.. వాళ్లు కేంద్ర బృందాలను పంపారని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని అన్నారు. తెలంగాణ ప్రజలకు లబ్ది చేకూరుతుందని చెప్పారు.
రాజ్ భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య గ్యాప్‌పై స్పందించేందుకు గవర్నర్ నిరాకరించారు. ‘‘నన్ను రాష్టప్రతి ప్రమాణ స్వీకారానికి పిలిచారు. అందుకే ఢిల్లీకి వచ్చాను. నేను రాజకీయాలు మాట్లాడాను’’ అంటూ గవర్నర్ తమిళిసై చెప్పారు. వరదలకు క్లౌడ్‌బస్టర్ కారణం అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తాను బరెస్ట్ కానని.. వరదల వల్ల నష్టపోయిన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తూనే ఉందన్నారు.
తాను ప్రోటోకాల్ ఆశించడం లేదన్నారు. సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వచ్చి వెళ్లిన తర్వాత కూడా ప్రోటోకాల్‌లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. భద్రాచలం వెళ్లినా అధికారులు ఎవరూ రాలేదని అన్నారు. ఇతర రాష్ట్రాల గవర్నర్లతో తాను పోల్చుకోననని చెప్పారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతోనే మోదీని విమర్శిస్తున్నారని అన్నారు.
ఇక, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదు పర్యటనలో రాజకీయాలపై చర్చించారా అని మీడియా తమిళిసైని ప్రశ్నించింది. అయితే దీనిపై తాను స్పందించనని గవర్నర్ తమిళి సై సమాధానం ఇచ్చారు. ఇక, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని మోదీ.. ఆ సమావేశాల అనంతరం.. రాజ్‌భవన్‌లో బస చేసిన సంగతి తెలిసిందే.