మెడికో ప్రీతి మరణంపై సమగ్ర విచారణ: కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వీసీకి గవర్నర్ ఆదేశం

By narsimha lode  |  First Published Feb 28, 2023, 2:30 PM IST

వరంగల్ కేఎంసీ  మెడికో  ప్రీతి మరణంపై  రాజ్ భవన్ స్పందించింది. భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు చోటు  చేసుకోకుండా చర్యలపై   గవర్నర్ వర్శిటీ  అధికారులను ఆదేశించారు. 
 


హైదరాబాద్: మెడికో ప్రీతి  మృతిపై  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ గా  స్పందించారు.  ప్రీతి  మరణంపై  నిజనిర్ధారణకు  అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేయాలని  కాళోజీ మెడికల్  యూనివర్శిటీ వీసీని  గవర్నర్ తమిళిసై ఆదేశించారు. 

గవర్నర్  తమిళిసై సౌందరరాజన్  ఆదేశాల మేరకు  రాజ్ భవన్ అధికారులు  మంగళవారంనాడు  లేఖ రాశారు.  మెడికో ప్రీతి మరణం భయంకరమైందిగా  ఆ లేఖలో  రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి.  ఈ విషయమై వాస్తవాలు తెలుసుకోవడానికి  అన్ని కోణాల నుండి విచారణ అవసరమని  రాజ్ భవన్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. 

Latest Videos

undefined

 కాలోజీ యూనివర్శిటీలో   ర్యాగింగ్,  వేధింపుల తరహ ఘటనలపై  గవర్నర్  తమిళిసై  నివేదిక కోరారు.   మెడికోలు, అసిస్టెంట్  ప్రొఫెసర్ల  పనివేళలు , మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పనితీరు  అంశాన్ని కూడా  ఆ లేఖలో  ప్రస్తావించాయి   రాజ్ భవన్ వర్గాలు.

ప్రీతిని నిమ్స్ కు తరలించడంతో  కీలకమైన సమయం కోల్పోయినట్టుగా రాజ్ భవన్  వర్గాలు ఆ లేఖలో  అభిప్రాయపడ్డాయి.  మెడికో ప్రీతిని  ఎంజీఎంకు తరలించి మెరుగైన చికిత్స  అందించాల్సి  ఉండేదని  రాజ్ భవన్  అభిప్రాయపడింది. 

గ్రీవెన్స్ సెల్  పనితీరు, బాధితుల సమస్యలను పరిష్కరించడం, మెడికోల ఫీడ్ బ్యాక్ వంటి అంశాల గురించి  కూడా ఆ లేఖలో  ప్రస్తావించింది రాజ్ భవన్.ర్యాగింగ్  నిరోధక  చర్యలు, యూనివర్శిటీ వీసీ  నియంత్రణలో ఉన్న యంత్రాంగంపై  నివేదిక ఇవ్వాలని లేఖలో  కోరారు.  ర్యాగింగ్  నిరోధక చట్టాలను పటిష్టంగా  అమలు చేయాలని  రాజ్ భవన్  ఆ లేఖలో  సూచించింది. 

ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని  బలోపేతం చేయాలని  కోరాయి  రాజ్ భవన్  వర్గాలు.సైకియాట్రీ విభాగానికి చెందిన హెచ్ఓడీ  నేతృత్వంలో  విద్యార్ధి కౌన్సిలింగ్  ఏర్పాటు చేయాలని  సూచించింది.

also read:ప్రీతి మృతికి రూ. 50 లక్షల అడ్మిషన్ బాండ్ కూడా కారణమేనా? వెలుగులోకి కొత్త ట్విస్ట్.. చివరిమాటల్లో ఏముంది??

భవిష్యత్తులో  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా  చర్యలు తీసుకోవాలని  రాజ్ భవన్  ఆదేశించింది.  ఈ మేరకు  వ్యూహలను రూపొందించాలని  కూడా  రాజ్ భవన్ వర్గాలు  ఆ లేఖలో  వీసీని ఆదేశించాయి.
 

click me!