సునీల్ శర్మ భేటీ: RTC కార్మికుల సమ్మెపై తమిళిసై రియాక్షన్ ఇదీ

By Siva KodatiFirst Published Oct 17, 2019, 7:17 PM IST
Highlights

ఆర్టీసీ సమ్మెతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆమె గురువారం ఆరా తీశారు. దీంతో రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌కు సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గురించి వివరించారు

ఆర్టీసీ సమ్మెతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆమె గురువారం ఆరా తీశారు. దీంతో రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌కు సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గురించి వివరించారు.

సామాన్యులు ఇబ్బందులు పడకుండా చూస్తున్నామని ఆయన గవర్నర్‌కు తెలిపారు. ఈ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సునీల్ శర్మను తమిళిసై ఆదేశించారు. సమ్మెపై ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయన్నారు. 

గురువారం నాడు మధ్యాహ్నాం గవర్నర్ సౌందరరాజన్  తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేశారు. ఆర్టీసీ సమ్మె గురించి గవర్నర్ వివరాలు తెలుసుకొన్నారు. ఈ సమయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎం కేసీఆర్ వద్ద సమీక్ష సమావేశంలో ఉన్నారు.

RTC Strike: రంగంలోకి దిగిన గవర్నర్ తమిళిసై, కేసీఆర్‌కు చిక్కులు...

గవర్నర్  నుండి ఫోన్ రావడంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రవాణా శాఖ కార్యదర్శిని గవర్నర్ వద్దకు పంపారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తీసుకొన్న చర్యల గురించి రవాణా శాఖ కార్యదర్శి  వివరించనున్నారు.

ఈ నెల 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు  సెల్ప్ డిస్మిస్ అయ్యారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సమ్మెకు సంబంధించి తెలంగాణ గవర్నర్ ను ఆర్టీసీ జేఎసీ నేతలు గవర్నర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 

బీజేపీ నేతలు రెండు దఫాలు ఇదే విషయమై గవర్నర్  తమిళిసై ను కలిశారు. ఆర్టీసీకి చెందిన భూముల లీజుల విషయంలో  బీజేపీ నేతలు ఈ నెల 16న గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతున్న తరుణంలో ఢిల్లీ నుండి గవర్నర్ కు పిలుపు వచ్చింది. 

ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోలేదా: కేసీఆర్‌పై ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీకి  వెళ్లి వచ్చిన తర్వాత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆర్టీసీ సమ్మెపై గవర్నర్  ఆరా తీశారు. ఆర్టీసీ కార్మికులు ఈ నెల 19వ తేదీన తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి..విపక్షపార్టీలు  తెలంగాణ బంద్ కు మద్దతును ప్రకటించాయి. 

ఇదిలా ఉంటే ఆర్టీసీ సమ్మె విషయమై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేరుగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశాంగా మారింది. సాధారణంగా రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిస్థితులపై గవర్నర్లు అధికారులు, మంత్రులతో నేరుగా మాట్లాడవచ్చు.

గతంలో గవర్నర్ గా పనిచేసిన నరసింహాన్ అధికారులతో సమీక్షలు కూడ నిర్వహించారు. కొన్ని విషయాలపై నేరుగా  ఆయన మంత్రులతో కూడ మాట్లాడారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను కూడ గవర్నర్ నేరుగా తనిఖీ చేసిన సందర్భాలు కూడ లేకపోలేదు.

click me!