వరంగల్‌కు గవర్నర్ : వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న తమిళిసై

Published : Aug 02, 2023, 09:31 AM ISTUpdated : Aug 02, 2023, 09:41 AM IST
వరంగల్‌కు గవర్నర్ : వరద ప్రభావిత  ప్రాంతాల్లో పర్యటించనున్న తమిళిసై

సారాంశం

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  ఇవాళ  ఉదయం  వరంగల్ కు చేరుకున్నారు.  వరంగల్ లోని  వరద ప్రభావిత ప్రాంతాల్లో  గవర్నర్ పర్యటించనున్నారు.

వరంగల్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  బుధవారంనాడు  ఉదయం వరంగల్ కు  చేరుకున్నారు.  వరంగల్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వరద బాధితులతో గవర్నర్ ముచ్చటించనున్నారు.ఇవాళ ఉదయం  వరంగల్ కు చేరుకున్న  గవర్నర్ కు జిల్లా అధికారులు  ఘనంగా స్వాగతం పలికారు.

రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్టుగా  గవర్నర్ నిన్ననే  ప్రకటించిన విషయం తెలిసిందే.  ఇవాళ  ఉదయం  ఆమె వరంగల్ కు  చేరుకున్నారు.  భారీ వరదల కారణంగా  ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని గవర్నర్ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో  గత వారంలో  భారీ వర్షాలు కురిశాయి.  ఈ వర్షాల కారణంగా  ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి.   ఈ వర్షాలతో  ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో  తీవ్రమైన ఆస్తి, ప్రాణ నష్టం చోటు  చేసుకుంది.  వరంగల్ పట్టణంలోని  పలు కాలనీల్లో వరద నీరు పోటెత్తింది.  వరంగల్ పట్టణానికి నలువైపులా ఉన్న చెరువులకు వరద పోటెత్తిన  కారణంగా  ఈ పరిస్థితి చోటు  చేసుకుంది.

తెలంగాణ రాష్ట్రంలో  జూలై రెండో వారం నుండి  భారీ వర్షాలు కురిశాయి.  జూన్ మాసంలో  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాధారణ వర్షపాతం కూడ నమోదు కాలేదు. కానీ  జూలై మాసంలో  సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.  జూలై మాసంలో  భారీ నుండి అతి భారీవర్షపాతం నమోదైంది. కొన్ని చోట్ల  60 సెం.మీ వర్షపాతం కూడ రికార్డైనట్టుగా  వాతావరణ శాఖ  గణాంకాలు చెబుతున్నాయి

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే