షాక్: కేసీఆర్ మీద తమిళిసై సంచలన వ్యాఖ్యలు

By team telugu  |  First Published Aug 18, 2020, 2:21 PM IST

గవర్నర్  తమిళిసై తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో సర్కారు బాధ్యతాయుతంగా వ్యవహరించడంలేదంటూ ఆమె జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 


కరోనా వైరస్ నియంత్రణ విషయంలో తెలంగాణ సర్కారుపై ఎప్పటినుండో గుర్రుగా ఉన్న గవర్నర్  తమిళిసై తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో సర్కారు బాధ్యతాయుతంగా వ్యవహరించడంలేదంటూ ఆమె జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో తెలంగాణ సర్కార్ క్రియాశీలకంగా వ్యవహరించలేదని, కరోనా ఉధృతిని, వ్యాప్తిని  ప్రభుత్వం అంచనా వేయడంలో విఫలమైందని గవర్నర్ తమిళిసై ఆరోపించారు. 

Latest Videos

undefined

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు భారీ సంఖ్యలో టెస్టులు చేయడమొక్కటే పరిష్కారమని, మొబైల్ టెస్టింగ్‌లు చేయాలని ప్రభుత్వాన్ని చాలాసార్లు కోరినట్టు తమిళిసై వ్యాఖ్యానించారు. కరోనా తీవ్రత, వ్యాప్తిపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, తగు సూచనలు చేస్తూ,ఇప్పటివరకు 5 నుండి ఆరు లేఖలు రాసినప్పటికీ...  ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని ఆమె ఈ సందర్భంగా  వ్యాఖ్యానించారు. 

టెస్టులు ఎందుకు తక్కువగా నిర్వహిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడల్లా... ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే టెస్టులు చేస్తున్నామంటూ ప్రభుత్వం సమర్ధించుకుంటోందని గవర్నర్ వ్యాఖ్యానించారు. 

కంటైన్మెంట్ జోన్ల విషయంలో కూడా ప్రభుత్వం ఉదాసీన వైఖరితో వ్యవహరించిందని, కరోనా బాధితులు ప్రభుత్వాస్పత్రుల్లో సదుపాయాలు లేక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారని ఆమె ప్రభుత్వం పై పెదవి విరిచారు. 

కరోనా చికిత్స తెలంగాణ సర్కార్ కి భారంగా మారిందని, అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ... ప్రభుత్వ ఆసుపత్రులంటేనే ప్రజలు ఆసక్తి చూపడంలేదని, గతంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తో సమావేశమైనప్పుడు ఇదే విషయాన్నీ నొక్కి చెప్పినట్టుగా తమిళిసై అన్నారు. 

click me!