రాజ్ భవన్ లో ఆదివారంనాడు బోనాల ఉత్సవాలను నిర్వహించారు. గవర్నర్ నల్ల పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించారు.
హైదరాబాద్: రాజ్ భవన్ లో ఆదివారంనాడు బోనాల ఉత్సవాలు నిర్వహించారు. బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బోనమెత్తుకున్నారు. రాజ్ భవన్ లో పనిచేసే మహిళలు ఇవాళ బోనాల సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు. రాజ్ భవన్ లోని మహిళలతో కలిసి తమిళిసై సౌందర రాజన్ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని రాజ్ భవన్ లోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బోనం సమర్పించారు. నల్లపోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.
బోనాలకు నాకు ఆహ్వానం అందలేదు: గవర్నర్
బోనాల ఉత్సవాలకు తనకు అధికారికంగా ఆహ్వానం అందలేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. రాజ్ భవన్ లో మహిళలు నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాల్లో పాల్గొనాలని తనకు ఆహ్వానం పంపారని ఆమె చెప్పారు.ఈ ఆహ్వానం మేరకు తాను బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నట్టుగా గవర్నర్ చెప్పారు.తెలంగాణలో బోనాలకు ప్రాధాన్యత ఉందన్నారన్నారు. అందరికీ అన్ని సౌకర్యాలు అందాలని అమ్మవారిని కోరుకున్నట్టుగా గవర్నర్ తెలిపారు.
గత కొంత కాలంగా రాజ్ భవన్, ప్రగతి భవన్ కు మధ్య అంతరం కొనసాగుతుంది. అయితే ఇటీవల రాష్ట్రపతి హైద్రాబాద్ కు వచ్చిన సమయలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రపతి వచ్చేవరకు గవర్నర్ తో కేసీఆర్ మాట్లాడారు. ఈ పరిణామంతో ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య గ్యాప్ తగ్గిందనే ప్రచారం సాగుతుంది. అయితే ఈ తరుణంలో బోనాల వేడుకలకు సంబంధించి తనకు ఆహ్వానం రాలేదని చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ కొనసాగుతుందని తేలింది.చాలా కాలంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ , సీఎం కేసీఆర్ మధ్య అంతరం సాగుతుంది. బడ్జెట్ కు ఆమోదం తెలపడం లేదని గవర్నర్ పై తెలంగాణ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించడం లేదని సుప్రీంకోర్టును కూడ కేసీఆర్ సర్కార్ ఆశ్రయించిన విషయం తెలిసిందే.