ఇకపై ఎన్నెకరాల లోపు భూములకు రైతు భరోసా..? కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం...

By Arun Kumar PFirst Published Jul 6, 2024, 12:25 PM IST
Highlights

రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం కీీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పెట్టుబడి సాయం అందించాలో ఫైనల్ చేసే దిశగా చర్యలు చేపట్టింది. 

Rythu Bharosa : రైతు భరోసా ... రైతులకు పంటసాగు కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం. గతంలో కేసీఆర్ సర్కార్ రైతుబంధు పేరిట ప్రతిఏటా రూ.10వేల ఆర్థికసాయం చేస్తే ఎన్నికల సమయంలో రైతు భరోసా పేరిట రూ.15వేలు రైతులకు ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతు భరోసా అమలుకు సిద్దమయ్యింది... ఇందులో భాగంగానే విధివిధానాల రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేసింది. 

తాజాగా రైతు భరోసాపై ఏర్పాటుచేసిన ఏర్పాటుచేసిన కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఎకరాకు పెట్టుబడి సాయం అందించింది... ఇలా సాగు భూములకే కాకుండా బీడు భూములు, కొండలు గుట్టలు, రియల్ ఎస్టేట్ స్థలాలకు కూడా రైతుబంధు ఇచ్చారు. ఆనాటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్పోరేట్ సంస్థలకు కూడా రైతు బంధు పడటం తీవ్ర వివర్శలకు దారితీసింది. దీంతో అప్రమత్తమైన కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా ఎంత భూమి కలిగిన రైతులకు ఇవ్వాలో నిర్ణయించే బాధ్యతలు ప్రజలకే అప్పగించింది. 

Latest Videos

ఇకపై బడా భూస్వాములు, రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఇవ్వకూడదని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అలాగే కేవలం సాగులో వున్న భూములకే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది.అయితే గరిష్టంగా ఎన్ని ఎకరాలు కలిగిన రైతులకు ఆర్థిక సాయం అందించాలన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. జూలై 11 నుండి  16 వరకు జిల్లా మంత్రులు,  ఇంచార్జి మంత్రులు రైతులతో సమావేశమై వారి అభిప్రాయాన్ని సేకరించాలని సూచించారు. ఇలా మూడురోజులపాటు వీలైనంత ఎక్కువమంది రైతుల అభిప్రాయాలను సేకరించి తమకు తెలియజేయాలని రైతు భరోసాపై ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. 

ఐదెకరాల లోపు రైతులకే రైతు భరోసా..? 

గత బిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా ప్రతి ఎకరాకు రైతుబంధు ఇవ్వకూడదని... కేవలం చిన్న, సన్నకారు రైతులకే రైతు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 93 శాతం మంది రైతులకు కేవలం ఐదెకరాల లోపు వ్యవసాయ భూములే వున్నాయి... కాబట్టి వీరికే రైతు భరోసా ఇవ్వాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.  

అయితే రైతు భరోసాపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే కొందరు రైతులు అయిదెకరాలు, మరికొందరు పదెకరాల లోపు సాగుభూమి కలిగిన రైతులకే పెట్టుబడి సాయాన్ని పరిమితం చేయాలని కోరుతున్నారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ వంటి ఉన్నత పదవుల్లోని ప్రజాప్రతినిధులు... ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. 

కౌలు రైతుల పరిస్థితేంటి..:  

సొంతంగా వ్యవసాయ భూమలు లేని రైతులు ఇతరుల భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటారు. అయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వం కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించలేదు. దీంతో ఎన్నికల సమయంలో కైలు రైతులకు కూడా రైతు భరోసా అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దాన్ని అమలు చేసేందుకు సిద్దమైంది రేవంత్ సర్కార్. 

అయితే ఇప్పటివరకు సొంత భూమి కలిగిన రైతులకే పెట్టుబడి సాయం అందింది... కానీ ఇప్పటినుండి భూమిని సాగుచేసే వారికే రైతు భరోసా అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం కౌలు రైతులు చేయాల్సిందల్లా భూ యజమానితో అగ్రిమెంట్ కుదుర్చుకోవడమే.ఈ అగ్రిమెంట్ ఆధారంగానే కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం వుంది. ఇలా కౌలు భూములకు రైతు భరోసాకు సంబంధించిన విధివిధానలను రూపొందిస్తోంది రేవంత్ సర్కార్. 

click me!