ప్రభుత్వం దేవతా హక్కుల పరిరక్షణలో పాలుపంచుకోవాలి

Published : Feb 24, 2022, 05:51 PM IST
ప్రభుత్వం దేవతా హక్కుల పరిరక్షణలో పాలుపంచుకోవాలి

సారాంశం

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణా ప్రభుత్వం ఆలయ వ్యవస్థ పునరుద్ధరణ, పరిరక్షణ కోసం కృషి  చేస్తుంద‌ని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి అన్నారు. రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న ఆర్టికల్ 363 హిందూ దేవత హక్కుల వివాదంపై ధర్మం ప్రకారం న్యాయం కోసం భగవంతుని భక్తుల కోరికను సూచించాలను కుంటున్నామన్నారు.  

దేవతా హక్కుల పరిరక్షణలో తెలంగాణ ప్రభుత్వం పాలుపంచుకోవాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి అన్నారు.  ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి గురువారం చిల్కూరు బాలాజీ ఆలయాన్ని సంద‌ర్శించి, ప్ర‌త్యేక‌ పూజలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దేవాల‌య ప‌రిర‌క్ష‌ణ‌కు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంటుంద‌నీ, దేవతా హక్కుల సమస్యను ముందుకు తీసుకెళ్ల వలసినదిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కోరతానని హామీ ఇచ్చారు.

దురదృష్టకర శబరిమల తీర్పు నుండి ప్రారంభమైన ఆర్టికల్ 363 వివాదానికి మద్దతు ఇచ్చిన మొదటి ఎంపీగా, ఈ వివాదం రాజ్యాంగబద్ధతపై తన అభిప్రాయాన్ని తెలియజేయమని జస్టిస్ వెంకటాచలయ్యకు ఇటీవల లేఖ కూడా రాశార‌ని తెలిపారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలోని తెలంగాణా ప్రభుత్వం ఆలయ వ్యవస్థ పునరుద్ధరణ. పరిరక్షణ కోసం కృషి చేస్తుంద‌న్నారు. అందువల్ల  గౌరవనీయులైన రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న ఆర్టికల్ 363 హిందూ దేవత హక్కుల వివాదంపై ధర్మం ప్రకారం న్యాయం కోసం భగవంతుని భక్తుల కోరికను సూచించాలనుకుంటున్నామన్నారు. ఆర్టికల్ 363 హిందూ దేవతా హక్కుల వివాదాన్ని తెలంగాణలోని శ్రీ చిల్కూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి లేవనెత్తారని అన్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu