వర్షం ఎఫెక్ట్: తెలంగాణలో అన్ని పరీక్షలు వాయిదా

Published : Oct 20, 2020, 04:19 PM IST
వర్షం ఎఫెక్ట్: తెలంగాణలో అన్ని పరీక్షలు వాయిదా

సారాంశం

 హైద్రాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో దసరా వరకు అన్ని రకాల పరీక్షలను వాయిదా వేసినట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.


హైదరాబాద్: హైద్రాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో దసరా వరకు అన్ని రకాల పరీక్షలను వాయిదా వేసినట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

 

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.గత వారం రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.

also read:హైద్రాబాద్‌‌‌లో వరదలు: గతంలో ముంచెత్తిన ముప్పులు ఇవీ...

దీంతో  రాష్ట్రంలోని పలు యూనివర్శిటీల పరిధిల్లోని విద్యాసంస్థల్లో జరుగుతున్న పరీక్షలను  వాయిదా వేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.దసరా పర్వదినం వరకు ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.
 

PREV
click me!

Recommended Stories

Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!
Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపూర్ కావ‌డం ఖాయం