ఈ నెల 16 నుండి తెలంగాణలో విద్యాసంవత్సరం: 8వతరగతి నుండి ఆన్‌లైన్ క్లాసులు

By narsimha lodeFirst Published Jun 10, 2021, 12:54 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో  ఈ నెల 16 వ తేదీ నుండి విద్యా సంవత్సరం ప్రారంభించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. 8వ తరగతి నుండి ఆపై తరగతుల విద్యార్థులకు క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ మేరకు విద్యాశాఖ మౌఖిక ఆదేశాలను జారీ చేసింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో  ఈ నెల 16 వ తేదీ నుండి విద్యా సంవత్సరం ప్రారంభించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. 8వ తరగతి నుండి ఆపై తరగతుల విద్యార్థులకు క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ మేరకు విద్యాశాఖ మౌఖిక ఆదేశాలను జారీ చేసింది.

గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉంచాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం  ఈ మాసఃంలోనే ఆన్‌లైన్ క్లాసులను ప్రారంభించాలని భావిస్తోంది. 8వ తరగతి నుండి 10వ తరతగతులతో పాటు ఇ:టర్ విద్యార్థులకు కూడ ఈ నెల 16 నుండి ఆన్‌లైన్ క్లాసులను నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. వచ్చే నెలలో రోజు విడిచి రోజూ స్కూళ్లను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. జూలై నెలాఖరుకు కరోనా కేసులు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. 

జూలై తర్వాతత కరోనా కేసులు తగ్గితే విద్యాసంస్థలను ప్రారంభించే అవకాశాల గురించి కూడ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విద్యా సంస్థలను ప్రారంభించారు. అయితే కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో  మార్చి 23 వ తేదీ నుండి విద్యాసంస్థలను మూసివేశారు.  టెన్త్, ఇంటర్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను ప్రమోట్ చేశారు.  ఇంటర్ సెకండియర్ పరీక్షలను కూడ రద్దు చేస్తూ ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. 


 

click me!