బూరుగుపల్లి శివారులో చిరుత కలకలం: భయాందోళనలో స్థానికులు

By narsimha lodeFirst Published Jun 10, 2021, 11:34 AM IST
Highlights

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని బూరుగుపల్లి గురువారం నాడు గాయపడిన చిరుత కలకలం రేపింది.  గాయాలతో ఉన్న చిరుత నడవలేని పరిస్థితుల్లో ఉంది. దీంతో  స్థానికులు అటవీశఆఖాధికారులకు సమాచారం ఇచ్చారు. 

మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని బూరుగుపల్లి గురువారం నాడు గాయపడిన చిరుత కలకలం రేపింది.  గాయాలతో ఉన్న చిరుత నడవలేని పరిస్థితుల్లో ఉంది. దీంతో  స్థానికులు అటవీశఆఖాధికారులకు సమాచారం ఇచ్చారు. బూరుగుపల్లి శివారులోనే నడవలేని స్థితిలో చిరుతపులి కన్పించింది. పులిని చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు.అయితే పులి గాయపడిన విషయాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో పులి కాలు కదపడం లేదు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

 

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని బూరుగుపల్లి గురువారం నాడు గాయపడిన చిరుత కలకలం రేపింది. గాయాలతో ఉన్న చిరుత నడవలేని పరిస్థితుల్లో ఉంది. దీంతో స్థానికులు అటవీశఆఖాధికారులకు సమాచారం ఇచ్చారు. pic.twitter.com/cRhTVXI3q3

— Asianetnews Telugu (@AsianetNewsTL)

పులికి మత్తు మందు అందించి బూరుగుపల్లి నుండి తరలించేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పులి  ఎలా గాయపడిందనే విషయమై ఫారెస్ట్ అధికారులు  ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే  పులి గురించి తెలిసిన వెంటనే స్థానికులు పులిని చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చారు. స్థానికులను పోలీసులు అక్కడి నుండి పంపించివేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో గతంలో కూడ పులుు  ప్రజలు ఉంటున్న ప్రాంతాల్లో సంచరించిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. గతంలో హైద్రాబాద్ శంషాబాద్ ప్రాంతంలో రోడ్డుపైనే పులి సేద తీరిన  విషయం తెలిసిందే. 
 

click me!