ఎంజీఎం ఆసుపత్రి విస్తరణకు ప్లాన్: సెంట్రల్‌ జైలులో ఖైదీల తరలింపునకు రంగం సిద్దం

By narsimha lode  |  First Published Jun 1, 2021, 9:28 AM IST

వరంగల్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ జైలును ఖాళీ చేయాలని  ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడంతో జైలులోని ఖైదీలను  రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని జైళ్లకు తరలించేందుకు జైళ్ల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.


వరంగల్: వరంగల్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ జైలును ఖాళీ చేయాలని  ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడంతో జైలులోని ఖైదీలను  రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని జైళ్లకు తరలించేందుకు జైళ్ల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఎంజీఎం ఆసుపత్రిని విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ ఆసుపత్రి విస్తరణ పనులకు అవసరమైన భూమిని  సెంట్రల్ జైలు భూమిని ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గత మాసంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని కేసీఆర్ సందర్శించారు. 

ఈ సమయంలో సెంట్రల్ జైలు స్థలాన్ని ఎంజీఎం ఆసుపత్రి విస్తరణ కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు జైళ్ల శాఖ చర్యలు తీసుకొంది. సెంట్రల్ జైలులో మొత్తం 966 ఖైదీలున్నారు. వీరిలో 615 జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న వారు ఉన్నారు.

Latest Videos

సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీల్లో  80 మంది మహిళా ఖైదీలున్నారు. ప్రస్తుతం ఈ జైలులో ఉన్న ఖైదీలను నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో సర్ధుబాటు చేసే ప్రయత్నాలను జైళ్ల శాఖ చేపట్టింది. జీవిత ఖైదు పడిన ఖైదీలతో పాటు మహిళా ఖైదీలను చర్లపల్లి జైలుకు తరలించే అవకాశం ఉందని సమాచారం. ఎంజీఎం ఆసుపత్రిలో రీజినల్ కార్డియాక్ సెంటర్, ఇతర వ్యాధుల నివారకు అనుగుణమైన  భనవాల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఎంజీఎం సూపర్ స్పెషాలిటీగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. 

రెండేళ్ల క్రితం వరంగల్ సెంట్రల్ జైలు నిర్మాణం కోసం ఉనికిచర్ల వద్ద సుమారు 100 ఎకరాల భూమిని గుర్తించారు.అయితే ఖైదీలు పనిచేసేందుకు గాను మరో 150 ఎకరాలు కావాలని జైళ్ల శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ భూమి కోసం అన్వేషణ ప్రారంభమైంది. మరోవైపు వరంగల్ లో సెంట్రల్ జైలును ఎక్కడ నిర్మిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. 

click me!