తీన్మార్ మల్లన్నను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు...

By AN TeluguFirst Published Aug 28, 2021, 1:53 PM IST
Highlights

సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌లో రెండు, చిక్కడపల్లి, జూబ్లీహిల్స్‌లో ఒక్కోటి చొప్పున నవీన్‌పై  కేసులు నమోదయ్యాయి. చిలకలగూడ కేసులో శుక్రవారం రాత్రి నవీన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్‌ : తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ ను చిలకలగూడ పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. సిటీ సివిల్‌ కోర్టులో మల్లన్న బెయిల్‌ పిటిషన్‌ వేయగా..  సెప్టెంబర్‌ 9 వరకు కోర్టు రిమాండ్‌ విధించింది. 

డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని తనను బెదిరించాడని ఒక వ్యక్తి కొద్ది రోజుల క్రితం చిలకలగూడ పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు ఠాణాకు పిలిపించి విచారణ జరిపారు. 

మరో కేసులో ఆయన కార్యాలయాన్ని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తనిఖీ చేశారు. సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌లో రెండు, చిక్కడపల్లి, జూబ్లీహిల్స్‌లో ఒక్కోటి చొప్పున నవీన్‌పై  కేసులు నమోదయ్యాయి. చిలకలగూడ కేసులో శుక్రవారం రాత్రి నవీన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

కాగా, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను సికింద్రాబాదులోని చిలకలగుడా పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి ఈ పోలీసులు ఆయనను అరెస్ట ుచేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడనిపై మల్లన్నపై ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం చిలకలగుడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అప్పట్లో పోలీసులు తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయనను పోలీసు స్టేషన్ కు పిలిపించి విచారించారు. మరో కేసులో తీన్మార్ మల్లన్న కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. తీన్మార్ మల్లన్నపై సైబర్ క్రైమ్ స్టేషన్ లో  రెండు కేసులు నమోదయ్యాయి. చిక్కడపల్లి, జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లలో ఒక్కటేసి కేసులు నమోదయ్యాయి. చిలకలగుడా కేసులోనే శుక్రవారం తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు .

ఈ ఏడాది ఏప్రిల్ లో నమోదైన కేసులో తీన్మార్ మల్లన్నకు రెడు సార్లు నోటీసులు ఇచ్చి విచారించామని, ఇప్పుడు అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. తీన్మార్ మల్లన్న తనను బెదిరిస్తున్నాడని సికింద్రాబాదు మధురానగర్ కాలనీలోలని మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన చిలకలగుడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఎన్నో ఏళ్లుగా తాను జ్యోతిష్యాలయం నిర్వహిస్తున్నానని, ఇటీవల కొందర వ్యక్తులు నకిలీ భక్తులను పంపి తనను ఇబ్బందులు పెడుతున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో చెప్పారు. తనకు రూ.30 లక్షలు ఇవ్వాలని తీన్మార్ మల్లన్న ఏప్రిల్ 19వ తేీదన తనకు వాట్సప్ కాల్ చేసి డిమాండ్ చేశారని ఆయన ఆరోపించారు. 

డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో తప్పు ప్రచారం చేయిస్తానని బెదిరించారని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఏప్రిల్ 20వ తేదీన తన చానెల్ లో తప్పుడు వార్తను ప్రసారం చేశారని ఆయన ఆరోపించారు. దాంతో మల్లన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే ఈ నెల 3వ తేీదన తీన్మార్ మల్లన్న కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.

click me!