గుడ్‌న్యూస్: ఎల్ఆర్ఎస్‌ మార్గదర్శకాలు ఇవీ...

By narsimha lodeFirst Published Sep 1, 2020, 2:46 PM IST
Highlights

స్థలాలనుక్రమబద్దీకరించుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఇవాళ్టి నుండి అక్టోబర్ 15వ తేదీ లోపుగా ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.


హైదరాబాద్:స్థలాలనుక్రమబద్దీకరించుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఇవాళ్టి నుండి అక్టోబర్ 15వ తేదీ లోపుగా ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.

ఎల్ఆర్ఎస్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నాడు మార్గదర్శకాలను విడుదల చేసింది. లేఅవుట్లు చేయకుండానే ప్లాట్ల క్రయ విక్రయాలు చేసిన వారంతా తమ స్థలాలను క్రమబద్దీకరించుకొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. టీఎస్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలకు ఎల్ ఆర్ ఎస్ వర్తించనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

లే అవుట్ క్రమబద్దీకరణకు గాను రూ. 10 వేలను ధరఖాస్తుగా ప్రభుత్వం నిర్ణయించింది. వ్యక్తిగతంగా ప్లాట్ల క్రమబద్దీకరణ కోసం కనీసం  వెయ్యి రూపాయాలను అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించారు.

 100 గజాలలోపు ప్లాట్లకు గజానికి రూ. 200 చొప్పున చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. 100 నుండి 300 గజాలలోపు ప్లాట్లకు గజానికి రూ. 400 రెగ్యులరైజేషన్ చార్జీలు వసూలు చేయనున్నారు. 300 గజాల నుండి 500 గజాలకు గజానికి రూ. 600 రెగ్యులరైజేషన్ ఛార్జీలను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

ఎల్ఆర్ఎస్ కోసం ధరఖాస్తులను అక్టోబర్ 15వ తేదీ లోపుగా ఆన్ లైన్ లో సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం కోరిన ప్రకారంగా డాక్యుమెంట్లను సమర్సిస్తే ఆ ప్లాట్లను క్రమబద్దీకరించనుంది ప్రభుత్వం.
 

click me!